‘డెన్మార్క్‌’లో ఆరోసీడ్‌గా శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2020-09-27T09:34:10+05:30 IST

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ వచ్చేనెల 13 నుంచి 19 వరకు జరిగే డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆరోసీడ్‌గా బరిలోకి దిగనున్నాడు...

‘డెన్మార్క్‌’లో ఆరోసీడ్‌గా శ్రీకాంత్‌

హైదరాబాద్‌: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ వచ్చేనెల 13 నుంచి 19 వరకు జరిగే డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆరోసీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. పురుషుల సింగిల్స్‌లో జపాన్‌ స్టార్‌ కెంటో మొమోటా, మహిళల్లో అకానె యమగూచి టాప్‌సీడ్లుగా పోటీపడుతున్నారు. మహిళల్లో సైనా నెహ్వాల్‌ అన్‌సీడెడ్‌గా తలపడనుండగా, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు టోర్నీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో శ్రీకాంత్‌, సైనాతో పాటు కశ్యప్‌, లక్ష్యసేన్‌, శుభాంకర్‌, అజయ్‌ జయరామ్‌ భారత్‌ తరఫున బరిలో ఉన్నారు.   

Updated Date - 2020-09-27T09:34:10+05:30 IST