11ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిని ఇంటర్యూ చేసిన కిడ్ రిపోర్టర్ మృతి

ABN , First Publish Date - 2021-05-16T18:35:19+05:30 IST

అతి చిన్న వయసులో ఏకంగా అమెరికా అధ్యక్షుడినే ఇంటర్యూ చేసి, కిడ్ రిపోర్టర్‌గా గుర్తింపు పొందిన డామన్ వీవర్ (23) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్జియాలోని ఆల్బెనీ స్టేట్ యూనివ

11ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిని ఇంటర్యూ చేసిన కిడ్ రిపోర్టర్ మృతి

వాషింగ్టన్: అతి చిన్న వయసులో ఏకంగా అమెరికా అధ్యక్షుడినే ఇంటర్యూ చేసి, కిడ్ రిపోర్టర్‌గా గుర్తింపు పొందిన డామన్ వీవర్ (23) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్జియాలోని ఆల్బెనీ స్టేట్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్‌ చదువుతున్న డామన్.. సహజ కారణాలతో మే 1న మరణించాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే డామన్ మరణానికి సంబంధించిన అంశంపై పూర్తి సమాచారాన్ని వారు వెల్లడించలేదు. కాగా.. డామన్ తన 11ఏళ్ల వయసులో 2009 ఆగస్టు 13న అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను వైట్‌హౌస్‌లోని డిప్లొమాటిక్ రూంలో సుమారు 10 నిమిషాలపాటు ఇంటర్యూ చేశాడు. విద్యా సంబంధ విషయాలపై ఒబామాను డామన్ ప్రశ్నించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అనంతరం అమెరికన్ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే, అథ్లెట్లు డ్వానే వాడే వంటి వారిని ఇంటర్యూ చేసి కిడ్ రిపోర్టర్‌గా గుర్తింపు పొందాడు.


Updated Date - 2021-05-16T18:35:19+05:30 IST