కిక్‌ బాక్సింగ్‌లో ఆంధ్ర క్రీడాకారులకు పతకాలు

ABN , First Publish Date - 2020-02-20T08:41:02+05:30 IST

ఇంటర్నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో ఆంధ్ర క్రీడాకారులు 22 పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలో జరిగిన కార్యక్రమానికి

కిక్‌ బాక్సింగ్‌లో ఆంధ్ర క్రీడాకారులకు పతకాలు

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఫిబ్రవరి 19: ఇంటర్నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో ఆంధ్ర క్రీడాకారులు 22 పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా  బుధవారం నగరంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కిక్‌ బాక్సింగ్‌ సంఘం అధ్యక్షుడు కరణంరెడ్డి నర్సింగరావు ముఖ్య అతిఽథిగా హాజరై విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌ కిక్‌ బాక్సింగ్‌ టోర్నీలో ఆంధ్ర నుంచి 32 మంది క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. వారిలో 22 మంది క్రీడాకారులు ఐదు స్వర్ణ, తొమ్మిది రజత, ఎనిమిది కాంస్య పతకాలు దేశానికి అందించి రాష్ట్ర క్రీడారంగ ఖ్యాతిని చాటారని పేర్కొన్నారు. కాగా ఈ చాంపియన్‌షిప్‌కు ఆంధ్ర నుంచి ఆనందబాలు, జోగారావు, టి.దుర్గ, కె.నిజామ్‌లు రిఫరీగా వ్యహరించడం విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు శామ్యూల్‌, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.


పతకాలు సాధించిన క్రీడాకారులు

కేవీఎల్‌ పృద్విల, ఎన్‌.సంపూర్ణ, ఏ.నాగ పవన్‌కుమార్‌, జి.సతీష్‌కుమార్‌, యు.పృథ్వీరాజు స్వర్ణ పతకాలు; ఏ.హరి, ఎం.సన్నీకుమార్‌, జి.దివాకర్‌, ఎన్‌.జనార్దన్‌, రితిష్‌ దాస్‌, ఏ.దుర్గాప్రసాద్‌ రజత పతకాలు: జి.వెంకట నరసింహం, పి.రాజు, ఎస్‌.బాలకృష్ణ కాంస్య పతకాలు సాధించారు.

Updated Date - 2020-02-20T08:41:02+05:30 IST