Abn logo
Oct 30 2020 @ 22:31PM

పవన్‌ రీమేక్‌ సినిమాలో రెండో హీరోగా ‘ఈగ’ విలన్‌

Kaakateeya

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుసగా సినిమాలు అంగీకరిస్తూ.. ప్రేక్షకులకే కాకుండా ఆయన అభిమానులకు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 'వకీల్‌ సాబ్‌' సినిమా సెట్స్‌పై ఉండగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ దశమి కానుకగా.. పవన్ కల్యాణ్ మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇక తాజాగా ప్రకటించిన పవన్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ మూవీపై సోషల్‌ మీడియాలో అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్‌ అని, వకీల్‌ సాబ్‌ తర్వాత పవన్‌ ఈ చిత్రంలోనే నటించనున్నాడని అంటున్నారు. అలాగే పవన్‌తో పాటు ఈ చిత్రంలో నటించే మరో హీరోగా రానా, నాని, నితిన్‌ పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో పవన్‌తో పాటు కలిసి నటించే హీరోగా కన్నడ స్టార్‌ హీరో, 'ఈగ' విలన్‌ సుదీప్‌ పేరు వినబడుతోంది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ని.. సుదీప్‌ ఆయన ఆఫీస్‌లో కలిసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయిక వెనుక కారణం ఇదేనని, ఈ సినిమా కథ గురించే వారు డిస్కస్‌ చేశారని అంటున్నారు. కిచ్చా సుదీపే ఈ చిత్రంలో రెండో హీరో అని.. టాలీవుడ్‌ సర్కిల్స్‌లో కూడా వార్తలు బయలుదేరాయి. మరి ఫైనల్‌గా పవన్‌తో కలిసి నటించే హీరో ఎవరవుతారో తెలియాలంటే.. చిత్రయూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement
Advertisement