Abn logo
Feb 21 2020 @ 21:38PM

రాలేనంటున్న కియారా

ఎక్కడకంటే.... దక్షిణాదికట! ఉత్తరాదిన కియారా అద్వానీ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దక్షిణాదిన కియారా రెండు సినిమాలే చేసినా స్టార్‌ హీరోయిన్‌కి వచ్చినంత పేరూ, క్రేజ్‌ సంపాదించుకుంది. ఆమెతో సినిమా చేయడానికి దక్షిణాది స్టార్‌ హీరోలు ముచ్చటపడుతుంటే, కియారా మాత్రం ఇక్కడ డేట్లు అడ్జస్ట్‌ చేయలేనంటోదట. తనకి కూడా దక్షిణాదిన ఏడాదికి ఒక సినిమా అన్నా చేయాలని ఉందట కానీ, ఉత్తరాదిన ఒప్పుకున్న సినిమాలు, వీటితో పాటు వెబ్‌ సిరీస్‌ కూడా ఆమెకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయట.


తాజాగా తెలుగు పింక్‌ రీమేక్‌లో ఆమెను నటింపజేయాలని అనుకున్నా కియారా తన వల్ల కాదని చెప్పేసిందట. కొందరు దర్శకనిర్మాతలు ఆమెకోసం ఆగాలని అనుకున్నా, వారికి కూడా వద్దని చెప్పేసిందట. ‘నా కోసం మీ టైంని వేస్ట్‌ చేసుకోకండి’ అంటూ మర్యాదగా వారిని తిప్పి పంపుతోందట. కియారా వ్యవహారం చూస్తుంటే ఈ ఏడాది కూడా ఆమె దక్షిణాదిన సినిమా చేసే అవకాశం లేనట్టే అంటున్నారు సినీ జనాలు.రాలేనంటున్న కియారా

Advertisement
Advertisement
Advertisement