Abn logo
Nov 30 2020 @ 00:00AM

థియేటర్లలోకి ఇందూ కీ జవానీ

బాలీవుడ్‌లో కథానాయికగా అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నారు కియారా అడ్వాణీ. ఆమె నటించిన ‘ఇందూకీ జవానీ’ చిత్రం డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘హీల్‌ ఇన్‌ టూట్‌ గయీ’ సాంగ్‌, టీజర్‌ను  ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా అడ్వాణీ విడుదల చేశారు.


‘‘హలో, నేను కియారా... ఇందూ గుప్తాను. ‘హీల్‌ ఇన్‌ టూట్‌ గయీ’ టీజర్‌ విడుదలైంది’ అని కియారా ఇన్‌స్టాలో తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లలో విడుదలయ్యే తొలి చిత్రం ఇదే అవుతుందని భావిస్తున్నారు. అబిర్‌సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరాగ్‌ పర్‌దేశీ కథానాయకుడు. 

Advertisement
Advertisement
Advertisement