Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 16 May 2022 10:12:10 IST

First look : ‘ఖుషీ’ గా VD, సామ్

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత పూరీ దర్శకత్వంలోనే ‘జగగణమన’ (JGM) చిత్రంలోనూ నటించబోతున్నాడు. ఈ మధ్యలో వీడీ ఓ అందమైన ప్రేమకథా చిత్రానికి కమిట్ అయ్యాడు. అందాల సమంత (Samantha) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాకి ‘ఖుషి’ (Khushi) అనే యూత్‌ఫుల్ టైటిల్ ను ఖాయం చేశారు.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొన్నీ మధ్య కశ్మీర్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టింది. విజయ్, సామ్ లపై ఆసక్తికరమైన సన్నివేశాల్ని చిత్రీకరించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. నేడు (సోమవారం) ‘ఖుషి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు మేకర్స్. డిసెంబర్ 23న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. 

ఒక గోడపై స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రివీలవగా.. ఆ పక్కనే అందాల సమంత (Samantha) చీరలో మెరిసిపోతూ నవ్వులు ఒలకబోస్తోంది. ఇద్దరి కొంగులు ముడివేయడం ఫస్ట్ లుక్ ప్రత్యేకత. ఈ ఇద్దరి వెనకాల మంచుకొండల బ్యాక్ గ్రౌండ్ పోస్టర్ కు మరింత అందాన్నిచ్చింది. ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ పాత్రలతో ఈ ప్రేమకథా చిత్రం రూపొందనుందని ఈ పోస్టర్ ను బట్టి అర్ధమవుతోంది. నాగచైతన్య (Naga Chaitanya) తో విడిపోయిన తర్వాత సామ్ నటిస్తున్న  తెలుగు ప్రేమకథా చిత్రం ఇదే కావడం విశేషం. చివరగా సామ్.. చైతూతో కలిసి ‘మజిలీ’ అనే లవ్ స్టోరీలో నటించింది. 

‘మహానటి’ చిత్రంలో మొదటి సారిగా జోడీ కట్టిన విజయ్, సామ్‌లు  మరోసారి ‘ఖుషి’ (Khushi) చిత్రంలో జంటగా నటించనుండడం విశేషంగా మారింది. ఆ ఇద్దరి పాత్రలు సినిమాకే హైలైట్ అవుతాయని దర్శకుడు చెబుతున్నాడు. శివ నిర్వాణ గత చిత్రం ‘టక్ జగదీష్’ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమాపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ అందమైన ప్రేమకథా చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement