Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 10:25:43 IST

Khushi movie : కశ్మీర్ షెడ్యూల్ పూర్తి

twitter-iconwatsapp-iconfb-icon

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అందాల సమంత (Samantha) జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Khushi). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘మహానటి’ (Mahanati) చిత్రం సూపర్ హిట్ తర్వాత విజయ్, సామ్ ఈ మూవీతో మరోసారి జోడీ కట్టనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఈ ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు ఎంతో అందంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సుందరమైన లొకేషన్స్‌ను సెట్ చేశారు. మొన్నీమధ్యే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చాలా గ్రాండ్‌గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే, పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టింది చిత్ర బృందం. మొదటి షెడ్యూల్‌ను కశ్మీర్‌లో మొదలుపెట్టారు. అక్కడే విజయ్, సామ్‌ల బర్త్ డే వేడుకల్ని ఘనంగా జరిపారు. ఇక తాజాగా ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ పూర్తయినట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ దిగిన ఫోటోను షేర్ చేశారు. అలాగే రెండో షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలిపారు.


ఇంతకు ముందు శివ నిర్వాణ (Shiva Nirvana) తీసిన ‘నిన్నుకోరి (Ninnu Kori), మజిలీ (Majili)’ చిత్రాల తరహాలో..  ఈ సినిమాలోనూ విజయ్, సామ్‌ల మధ్య సాగే ఎమోషనల్ జెర్నీ ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుందని చెబుతున్నారు.  ‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ చిత్రాలతో డిఫరెంట్ ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ ( (Vijay Devarakonda ).. ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ పాత్రను పోషిస్తున్నాడట. ఈ సినిమాకి అదే హైలైట్ అని చెబుతున్నారు. అలాగే... సామ్ (Sam) కేరక్టరైజేషన్ కూడా అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుందట. ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.  హేషమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విజయ్, సామ్‌లకు ఏ స్థాయిలో సక్సెస్‌నిస్తుందో చూడాలి.   


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International