Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 29 May 2022 18:03:28 IST

సినీ ఎంట్రీ ఇస్తున్న Khushbu కూతురు

twitter-iconwatsapp-iconfb-icon

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నిన్నటి తరం నటి ఖుష్బూ(Khushbu). తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అభిమానుల్లో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ అభిమానులు ఆమెకు గుడి కట్టి పూజలు కూడా చేశారు. స్టార్ డైరెక్టర్ సుందర్‌ సి(Sundar C)ను 2000లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బూ పెద్ద కుమార్తె ఆనందిత చిన్న వయసులోనే ఎంటర్ ప్రెన్యూర్‌గా మారింది. మేకప్ ఉత్పత్తులకు సంబంధించిన ‘అన్మోల్’ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. పెద్ద కుమార్తె అవంతిక(Avanthika) సినీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఖుష్బూ తెలిపింది.  


అవంతిక సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటంతో ఆశీస్సులు అందించాలని ఖుష్బూ చెప్పింది. ‘‘నా పెద్ద కూతురు అవంతిక ఎన్నో కలలతో లండన్‌లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణను పూర్తి చేసింది. ఆమె సొంతంగా నిలదొక్కుకొవాలి కాబట్టి ఇప్పుడే అసలైన పోరాటం ప్రారంభమవుతంది. మేం ఆమెను లాంచ్ చేయడం లేదు. సిఫార్సు చేయడం లేదు. మీరే నా కుమార్తెను దీవించాలి’’ అని ఖుష్బూ సోషల్ మీడియాలో పేర్కొంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement