పంగులూరులో ముగిసిన ఖోఖో శిక్షణ

ABN , First Publish Date - 2022-09-25T05:24:58+05:30 IST

36వ జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే రాష్ట్ర ఖోఖో పురుషుల జట్టు శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈనెల 30 నుంచి అక్టోబరు 5 వరకు గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పట్టణంలో జరగనున్న 36వ జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే రాష్ట్ర ఖోఖో పురుషుల జట్టు గతనెల 20 నుంచి ఎంఎస్‌ఆర్‌ అండ్‌ బీఎన్‌ఎం జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో శిక్షణ పొందుతున్నారు.

పంగులూరులో  ముగిసిన ఖోఖో శిక్షణ
36వ జాతీయ ఖోఖో క్రీడా పోటీలలో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టు

పంగులూరు, సెప్టెంబరు 24: 36వ జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే రాష్ట్ర ఖోఖో పురుషుల జట్టు శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈనెల 30 నుంచి అక్టోబరు 5 వరకు గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పట్టణంలో జరగనున్న 36వ జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే రాష్ట్ర ఖోఖో పురుషుల జట్టు గతనెల 20 నుంచి ఎంఎస్‌ఆర్‌ అండ్‌ బీఎన్‌ఎం జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో శిక్షణ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఒలంపిక్‌, ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ సహకారంతో ఈ శిక్షణ  కార్యక్రమం నిర్వహించారు. ఈ జట్టుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా, భోజన వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఖోఖో అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, సీతారామిరెడ్డి తెలిపారు. క్రీడాకారులకు ప్రముఖ న్యాయవాది మేకల రవీంద్రనాధరెడ్డి క్రీడా దుస్తులు సమకూర్చారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో రవీంద్రరెడ్డితో పాటు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఆర్వీ సుబ్బారావు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి, ఎనికపాటి శ్రీనివారావు, గుడిపూడి రామారావు పాల్గొన్నారు. 

రాష్ట్ర పురుషుల జట్టు..

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పట్టణంలో ఈనెల 30 నుంచి జరిగే 36వ జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టును అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి శనివారం ప్రకటించారు. పోతిరెడ్డి శివారెడ్డి, అట్ల శివనాగిరెడ్డి, స్వామినాదన్‌, ఏడుకొండలరెడ్డి, ఆలీనవాజ్‌ (ఉమ్మడి ప్రకాశం), పుట్ట నరసయ్య, వెంకటేష్‌, సురేష్‌ (విజయనగరం), యల్లా సతీష్‌(తూ.గో.), లంకా అప్పల నాయుడు (ప.గో), గంగరాజు( విశాఖ), రాజ్‌కుమార్‌ (చిత్తూరు), కట్ట రామ్మోహన్‌ (కడప), కొండలరావు (కృష్ణా), పురుషోత్తం (అనంతపురం)ను ఎంపికచేశారు. జట్టు కోచ్‌గా కె.పట్టాభిరామం, అసిస్టెంట్‌ కోచ్‌గా శ్రీనివాసరావు (తూ.గో.), మేనేజర్‌గా బి. కాశీవిశ్వనాధరెడ్డి (ప్రకాశం) వ్యవహరిస్తారని ఏపీ ఒలంపిక్‌ అసోషియేషన్‌ కార్యదర్శి పురుషోత్తం తెలిపారు.


Updated Date - 2022-09-25T05:24:58+05:30 IST