ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్‌ షురూ

ABN , First Publish Date - 2021-02-27T09:09:51+05:30 IST

ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్‌ షురూ

వర్చువల్‌గా  ప్రారంభించిన మోదీ


న్యూఢిల్లీ: ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మార్చి 2వ తేదీ వరకు జరిగే ఈ క్రీడల్లో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి 1200మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘అంతర్జాతీయ వింటర్‌ గేమ్స్‌లో భారత్‌ ఉనికిని చాటిచెప్పే ప్రయతంలో ఈ క్రీడలు ఓ ముందడుగు. అంతేకాదు జమ్మూ, కశ్మీర్‌ను వింటర్‌ గేమ్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకూ దోహదపడతాయి’ అని అన్నారు. గుల్మార్గ్‌లో క్రీడల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. ‘భారత్‌ను క్రీడా శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నాలను కొనసాగిస్తాం’ అని ప్రకటించారు. 

Updated Date - 2021-02-27T09:09:51+05:30 IST