ఖేలో ఇండియా ‘ఈపాఠశాల’ తరగతులు

ABN , First Publish Date - 2020-06-01T09:43:30+05:30 IST

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా మెరుగైన శిక్షణ అందించే ఉద్దేశంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఖేలో ఇండియా ‘ఈ-పాఠశాల’ ఆన్‌లైన్‌ కోచింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు

ఖేలో ఇండియా ‘ఈపాఠశాల’ తరగతులు

న్యూఢిల్లీ: దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా మెరుగైన శిక్షణ అందించే ఉద్దేశంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఖేలో ఇండియా ‘ఈ-పాఠశాల’ ఆన్‌లైన్‌ కోచింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు ఈ కార్యక్రమాన్ని సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ సహా మొత్తం 21 క్రీడాంశాల్లో ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ తరగతుల్లో యువ క్రీడాకారులతో ప్రముఖ ప్లేయర్లు అప్పుడప్పుడు ముచ్చటించేలా ఈ కార్యక్రమాన్ని సాయ్‌ రూపకల్పన చేసింది.

Updated Date - 2020-06-01T09:43:30+05:30 IST