పురాతన ఆలయాలను పరిరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-20T04:55:34+05:30 IST

పురాతన ఆలయాలను పరిరక్షించుకోవాలి

పురాతన ఆలయాలను పరిరక్షించుకోవాలి
ధర్మరావుపేటలోని త్రికుట శివాలయాన్ని పరిశీలిస్తున్న పురావస్తు శాఖ అధికారులు

  రాష్ట్ర పురావస్తుశాఖ ఏడీ మల్లునాయక్‌

ఖానాపురం, అక్టోబరు 19: కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను పరి రక్షించుకోవాలని రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ మల్లునాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ధర్మరావుపేటలో కాకతీయరాజైన గణపతిదేవుని కాలంలో నిర్మించిన త్రికుట శివాలయం, అశోక్‌నగర్‌లోని మట్టికోటలో శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని, బస్టాండ్‌ దగ్గర ఉన్న ప్రతాపరుద్రుడిగా పిలవబడుతున్న 12వ శతాబ్ధి సుపార్శ్వ నాథ జైనతీర్థాకర విగ్రహాన్ని, కాకతీయల కాలం నాటి గణేష, శివలింగాలను ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో శివనాగిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయాల  చరిత్ర, వాస్తు, శిల్పాలపై పరిశోధన చేశారు. ఆలయాల్లోని శాసనాలను శివనాగిరెడ్డి చదివి వినిపించారు. ఆలయాల పరిరక్షణకు  ప్రతిపాదనలు ప్రభు త్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు. వారసత్వ సంపదల పరిరక్షణపై గ్రా మస్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌ రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, వైస్‌ఎంపీపీ రామసహాయం ఉమారాణి, సర్పంచ్‌లు వెన్ను శృతి, గొర్రె కవిత, ఎంపీటీసీ బల్గూరి విజాకర్‌రావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, స్థపతి రఘువీర్‌, బుద్ధవనం ఓఎస్‌డీ సుధన్‌రెడ్డి, శ్యాంసుందర్‌ రావు, అర్చకులు అన్వేష్‌శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-20T04:55:34+05:30 IST