Palvancha: కుటుంబం ఆత్మహత్య ఘటనలో సాహితి మృతి

ABN , First Publish Date - 2022-01-05T14:25:48+05:30 IST

పాల్వంచలో కుటుంబ ఆత్మహత్య ఘటనలోకొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చిన్నారి సాహితీ మృతి చెందింది.

Palvancha: కుటుంబం ఆత్మహత్య ఘటనలో సాహితి మృతి

ఖమ్మం: పాల్వంచలో కుటుంబ ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాహితీ మృతి చెందింది. దీంతో నాగరామకృష్ణ కుటుంబంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈనెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.  రామకృష్ణ తన భార్య, పిల్లలకు నిప్పంటించిన ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రామకృష్ణ దంపతులు, ఓ కుమార్తె సజీవదహనం అవగా.... మరో చిన్నారి సాహితికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సాహితి పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం మృతి చెందింది. 

Updated Date - 2022-01-05T14:25:48+05:30 IST