సామాజిక దూరంతోనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-03-29T11:45:58+05:30 IST

సామాజిక దూరం పాటించడం ద్వారా నే కరోనాను కట్టడి చే యొ చ్చని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి అన్నారు. శని వారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పాల్వంచ,

సామాజిక దూరంతోనే కరోనా కట్టడి

 భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం కలెక్టరేట్‌, మార్చి 28: సామాజిక దూరం పాటించడం ద్వారా నే కరోనాను కట్టడి చే యొ చ్చని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ. రెడ్డి అన్నారు. శని వారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పాల్వంచ, కొత్తగూ డెం పట్టణాల్లో వర్తకులు నిత్యావసర సరు కులు, కూరగాయలను హోం డెలివరీ చేయడానికి ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. ప్రజలు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, కూర గాయల జాబితాను వాట్సాప్‌ ద్వారా తెలిపిన ఫోన్‌ నెంబర్లకు పంపితే వారే సరుకులను ప్యాక్‌చేసి ఇంటికి తెచ్చి ఇస్తారన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రజలకు అందుబాటులో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు.


వ్యాపారులు దుకాణాల వద్ద కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదే శించారు. కంట్రోల్‌ రూంనకు వచ్చే ఫోన్‌కాల్స్‌ పర్య వేక్షణకు అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో మధుసూధనరాజు, జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారి భీ మ్లాను నియమిం చా మన్నారు. కంట్రోల్‌ రూం 24 గంటలు పని చేస్తుం ద న్నారు. ప్రజలు 08744-241950, 9392305104, 9392 307840లతోపాటు 100కు కూడా ఫోన్‌ చేసి స మాచా రం ఇవ్వవచ్చాన్నారు. క్వారంటైన్‌ పాటించని వ్య క్తుల సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలని కోరారు. 

Updated Date - 2020-03-29T11:45:58+05:30 IST