ఖమ్మం పర్యాటక శోభను సంతరించుకుంటోంది. లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఖమ్మంకు కొత్త అందాలను తీసుకువచ్చింది. పైన ఆకాశం, కింద నీరు.. మధ్యన ఊగుతూ నడుస్తుంటే.. ఆ థ్రిల్లే వేరు. ఇలాంటి అనుభూతిని త్వరలోనే ఖమ్మం ప్రజలు ఆస్వాదించబోతున్నారు.