Abn logo
Jun 20 2021 @ 15:08PM

ఖమ్మం జిల్లా: చర్లమండలం సరిహద్దుల్లో గిరిజనుల కష్టాలు

ఖమ్మం జిల్లా: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజనుల బ్రతుకుల్లో మార్పు రావడంలేదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం సరిహద్దులోని ఛత్తీస్‌గడ్‌లో నేటికి అనేక గ్రామాల్లో సరైన రోడ్లు కూడా లేవు. వర్షాకాలంలో అయితే వారి బాధలు వర్ణనాతీతం. ప్రాణాల మీదకు వస్తే వాగులు, గుట్టలు దాటి ప్రాణాలు కాపాడుకోవాల్సిన దుస్థితి.


చర్లమండలం సరిహద్దులోని పూసగుప్పగ్రామ శివారులో ఇలాంటి పరిస్థితి ఒకరికి ఎదురైంది. కొండపల్లి గ్రామానికి చెందిన ఉంగా అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో కుటుంబసభ్యులు పక్కనే ఉన్న చర్లమండలానికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో జెడ్డీ కట్టి తమ గ్రామం నుంచి సుమారు 25 కి.మీ. వాగులు, గుట్టలు దాటుతూ మోసుకుంటూ వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రతి ఏడాది ఇదే విధంగా కష్టాలు పడుతున్నా ప్రభుత్వాలు, నేతలు పట్టించుకోవడంలేదు. రహదారులు లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఇదే విధంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మోసుకువస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.