Khammam: వాగులోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ప్రాణనష్టం

ABN , First Publish Date - 2021-08-29T15:55:58+05:30 IST

చింతకాని మండలం జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రమాదవశాత్తు తుమ్మలవాగులోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి

Khammam: వాగులోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ప్రాణనష్టం

ఖమ్మం: చింతకాని మండలం జగన్నాథపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రమాదవశాత్తు తుమ్మలవాగులోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కారులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో చిక్కకున్న ప్రయాణికులను స్థానికులు బయటికి తీశారు. స్వల్ప గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-29T15:55:58+05:30 IST