రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ : షర్మిల

ABN , First Publish Date - 2022-06-16T10:04:59+05:30 IST

సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి అప్పులపాలు చేశారని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ : షర్మిల

చింతకాని/ఖమ్మంసంక్షేమవిభాగం, జూన్‌ 15: సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి  అప్పులపాలు చేశారని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు, రేపల్లెవాడ, చింతకాని, జగన్నాథపురం, పందిళ్లపల్లి, గాంధీనగర్‌, రామకృష్ణాపురం గ్రామాల్లో బుధవారం ఆమె  ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. చింతకాని, పందిళ్లపల్లిలో మాటా-ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు పెరిపోవడంతో సామాన్యులు బతికే రోజులు లేవన్నారు. కేజీ టూ పీజీ ఉచితం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను బంద్‌ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు మూడు వేల పాఠశాలలు మూసివేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు వైఎ్‌సఆర్‌ బిడ్డగా పార్టీ పెట్టానని, ఒక్క అవకాశమిస్తే అన్నివర్గాల జీవితాలను పండుగ చేస్తానన్నారు. కాగా, షర్మిల పాదయాత్రలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చింతకాని సర్పంచ్‌ బండి సుభద్ర పాల్గొన్నారు. గ్రామంలో సభ పూర్తయ్యేంతవరకు ఆమె అక్కడే ఉన్నారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-06-16T10:04:59+05:30 IST