రైల్వేలో కళాసీ వ్యవస్థకు ముగింపు

ABN , First Publish Date - 2020-08-08T07:21:05+05:30 IST

భారత్‌లో బ్రిటిష్‌ పాలన కాలం నాటి నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే సీనియర్‌ అధికారుల ఇళ్లలో పనిచేసే ఖలాసీ (ప్యూన్‌)ల ఉద్యోగాలకు కొత్తగా నియామకాలు ఉండబోవని...

రైల్వేలో కళాసీ వ్యవస్థకు ముగింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత్‌లో బ్రిటిష్‌ పాలన కాలం నాటి నుంచి కొనసాగుతున్న కళాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే సీనియర్‌ అధికారుల ఇళ్లలో పనిచేసే ఖలాసీ (ప్యూన్‌)ల ఉద్యోగాలకు కొత్తగా నియామకాలు ఉండబోవని చెప్పింది. అయితే, టెలిఫోన్‌ అటెండెంట్‌-కమ్‌-డాక్‌ ఖలాసీ(టీఏడీకే)లకు సంబంధించిన అంశం మాత్రం తమ పరిశీలనలో ఉందని చెప్పింది. అలాగే జూలై 1 నాటికి చేపట్టిన  నియామకాలనూ రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని చెప్పింది. 

Updated Date - 2020-08-08T07:21:05+05:30 IST