హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ వినాయక నియజ్జనం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్‌లో నుంచి ట్యాంక్‌బండ్‌కు మహాగణపతిని తీసుకువచ్చారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం చేశారు. నిమజ్జనం చూసేందుకు హుస్సేన్‌సాగర్ దగ్గర భక్తులు పోటెత్తారు. మహాగణపతిని నిమజ్జనం చేస్తుంటే భక్తులు తమ సెల్ఫోన్లతో విడియోలు తీసుకున్నారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాధునికి ఘనంగా వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. గతంలో 27 క్రేన్లను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది వాటిని కుదించారు. మిగిలిన వాటిని పీపుల్స్ ప్లాజావైపు మళ్లించారు. ఆదివారం జరిగే సామూహిక నిమజ్జనాన్ని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక్క ట్యాంక్‌బండ్‌పైనే బందోబస్తు కోసం 600 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. రెండు క్రేన్లకు ఒక సీఐ, ప్రతి క్రేన్‌కు ఒక ఎస్ఐతో పాటు నలుగురు సిబ్బంది నిమజ్జన ఘట్టాన్ని పర్యవేక్షిస్తున్నారు.