TS News.. హైదరాబాద్: చవితి వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

ABN , First Publish Date - 2022-08-28T15:58:03+05:30 IST

హైదరాబాద్ (Hyderabad): చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణనాధుడు సిద్ధమయ్యాడు.

TS News.. హైదరాబాద్: చవితి వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

హైదరాబాద్ (Hyderabad): చవితి వేడుకలకు ఖైరతాబాద్ గణనాధుడు సిద్ధమయ్యాడు.  గణేష్ విగ్రహం తయారీ పూర్తి అయింది. ఈ ఏడాది శ్రీ పంచముఖి లక్ష్మి మహా గణపతి రూపంలో భక్తులకి దర్శనం ఇవ్వనున్నాడు. 60 ఏళ్లలో మొదటి సారిగా ఖైరతాబాద్ గణనాధుడిని మట్టితో తయారు చేశారు. జూన్ 10 నుంచి  గణేష్ విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడు 50 అడుగుల ఎత్తులో  గణేషుడు దర్శనం ఇస్తున్నాడు. ఖైరతాబాద్ గణేషుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామీ, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుతీరారు. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరగనుంది. ఖైరతాబాద్ గణేష్ తయారీకి కోటి 50 లక్షల రూపాయల వ్యయం అయినట్లు సమాచారం.

Updated Date - 2022-08-28T15:58:03+05:30 IST