Khairatabad BJPలో కలకలం

ABN , First Publish Date - 2022-07-01T17:45:47+05:30 IST

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర సమయం ఉన్నప్పటికీ పార్టీల బదలాయింపులు

Khairatabad BJPలో కలకలం

గురుశిష్యుల మధ్య విభేదాలు  

కొంతకాలంగా చింతలకు దూరంగా వెల్దండ 

టీఆర్‌ఎస్‌లో చేరిన జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌


హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర సమయం ఉన్నప్పటికీ పార్టీల బదలాయింపులు జోరందుకున్నాయి. ఇప్పటికే కొంతమంది ఫిరాయింపులు చేయగా మరికొందరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఖైరతాబాద్‌ రాజకీయాలపై అంతటా ఆసక్తి నెలకొంది. వారం రోజుల క్రితం ఖైరతాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌, మాజీ సీఎల్పీ నేత పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి టీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరారు. టీఆర్‌ఎస్‌లో తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. మాతృ పార్టీ అయిన కాంగ్రె్‌సలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ బదలాయింపును టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియ్‌సగా తీసుకుంది.

అంతే కాకుండా నియోజకవర్గంలో బీజేపీ కాస్త బలం పెరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. వారిలో జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌ కాస్త అసంతృప్తితో ఉన్నారని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి తెలిసింది. వెంటనే వారు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అప్రమత్తం చేశారు. రెండు రోజులుగా వెల్దండతో ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి రహస్య మంతనాలు జరిపారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొని చివరకు వెల్దండ వెంకటే్‌షను మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరేలా చేశారు. 


చివరి క్షణంలో టికెట్టు.. 

గ్రేటర్‌ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్‌ బీజేపీ టికెట్టు కోసం చివరి క్షణం వరకు ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒకరి పేరును ప్రస్తావించగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాత్రం వెల్దండ పేరు ప్రస్తావించారు. చివరి క్షణంలో వెల్దండకు టికెట్టు లభించింది. అయితే జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో బీజేపీ గెలుపు అసాధ్యం అని అందరూ భావించారు. పార్టీలో అసంతృప్తులు మరిన్ని ఇబ్బందులు సృష్టించారు. వెల్దండ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. అంతేగాకుండా డివిజన్‌ నుంచి మొదటి సారిగా వడ్డెర కులస్థుడికి టికెట్టు రావడంతో పాటు వెల్దండకు వ్యక్తిగతంగా మంచిపేరు ఉండటంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సుమారు 600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి వెంకటేష్‌ బీజేపీని బలోపేతం చేసేందుకు శ్రమించాడు. కాగా కొంతకాలానికి మాజీ ఎమ్మెల్యే చింతలతో విభేదాలు తలెత్తాయి. ఫిలింనగర్‌లో దేవాలయ నిర్మాణ వివాదం ఇద్దరి మధ్య దూరం పెంచింది. చింతల కారణంగా తన పరువు పోయిందనే భావన వెల్దండలో ఏర్పడింది. కాగా చింతల కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో వెల్దండపై విమర్శలు చేసినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాల కోసం జనసమీకరణకు కావాల్సిన నిధులు విషయంలో కూడా ఇద్దరు పలుసార్లు వాదనలకు దిగారు.

దీంతో చాలాకాలంగా వెల్దండ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే ప్రదాని మోదీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన వెంకటే్‌షకు అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. అంతేగాక నియోజకవర్గం పార్టీలో వర్గ పోరు అతడిని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. దీనికి తోడు కార్పొరేటర్‌గా గెలిచిన కొన్ని రోజులకు ఆయనకు అధిక సంతానం ఉందని కోర్టులో కేసు పడటం చికాకు కలిగించింది. మంత్రి కేటీఆర్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో టీఆర్‌ఎ్‌సలో చేరినట్లు తెలుసోౖంది. 


బీజేపీలో ఆందోళన.. 

ఏడాది గడిస్తే ఎన్నికలు. ఇలాంటి సమయంలో పార్టీని కార్పొరేటర్‌ వీడటంతో కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ ఓ రకమైన ఆందోళన నెలకొంది. 2014లో టీడీపీతో దోస్తీ కట్టి బీజేపీ అఽభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి వరకు నియోజకవర్గంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి కాస్త మెరుగవుతూ వచ్చింది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ మూడు డివిజన్లలో విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా అన్నింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది.  రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంతో పోలిస్తే బీజేపీకి బలం పెరిగిందనేది ఈ ఎన్నికలతో తేలింది. దీంతో గత గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అన్ని కలిసి రావడంతో రెండు డివిజన్‌లలో గెలిచింది.

మిగతా వాటిల్లో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఇదే జోరుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని పార్టీ నాయకులు భావించారు. ఈ తరుణంలో కార్పొరేటర్‌ పార్టీ ఫిరాయించడంతో కలకలం రేగింది. ఇప్పటికే నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇది చాలదన్నట్టు జూబ్లీహిల్స్‌ లాంటి ప్రతిష్ఠాత్మక డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్‌ను కోల్పోవడం పార్టీకి పెద్ద దెబ్బ అని సీనియర్లు భావిస్తున్నారు. వెల్దండ అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాలకు మొదటి నుంచి తెలుసు. ఆయనతో అధిష్ఠానం చర్చలు జరిపి ఉంటే ఈ పరిస్థితి రాకపోయి ఉండేదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


డివిజన్‌ అభివృద్ధి కోసమే : వెల్దండ  

జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఓటర్లు తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేశారని, అధికార పార్టీలో చేరితే డివిజన్‌ అభివృద్ధికి భారీగా నిధులు సమీకరించవచ్చనే భావనతో టీఆర్‌ఎస్‌ చేరినట్టు జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌ తెలిపారు. బీజేపీ టికెట్టు తీసుకున్నప్పటికీ తన వ్యక్తిగత పలుకుబడి, కుల సమీకరణ, పార్టీ గుర్తు, ప్రజల నమ్మకం గెలిపించిందన్నారు. ప్రస్తుతం బీజేపీలో వర్గ పోరు తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బీసీలను అణగదొక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ ఇబ్బందులను అధిగమించేందుకు పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. తాను ఎవరి మీద విమర్శలు చేయబోనని, కేవలం డివిజన్‌ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-01T17:45:47+05:30 IST