కేజీహెచ్‌ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలి

ABN , First Publish Date - 2022-05-21T04:33:20+05:30 IST

ఉత్తరాంధ్ర వైద్యదాయని కేజీహెచ్‌ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా మార్చాలన్నది తమ ప్రయత్నమని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారా యణ అన్నారు.

కేజీహెచ్‌ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలి
చెత్త తరలిస్తున్న లక్ష్మీనారాయణ

స్వచ్ఛభారత్‌లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం, మే 20: ఉత్తరాంధ్ర వైద్యదాయని కేజీహెచ్‌ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా మార్చాలన్నది తమ ప్రయత్నమని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారా యణ అన్నారు. జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో శుక్రవారం స్వచ్ఛభారత్‌  ్జకార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలు తొలగించారు.


ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంటే సగం రోగాలు మటు మాయం అవుతాయన్నారు. కేజీహెచ్‌లో ప్లాస్టిక్‌ వాడకం తగ్గించగలిగితే ఆరోగ్య కరమైన వాతావరణం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అందుకే ప్లాస్టిక్‌ తెచ్చి ఇచ్చిన వారికి కేజీ బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ కన్వీనర్‌ జగన్‌ మురారి, ప్రతినిధి ప్రియాంక రావు, గాయత్రి, సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-05-21T04:33:20+05:30 IST