నాగర్‌కర్నూల్ జిల్లాలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సస్పెండ్

ABN , First Publish Date - 2021-03-26T13:31:20+05:30 IST

జిల్లాలోని కేజీబీవీ ప్రత్యేక అధికారిని అధికారులు సస్పెండ్

నాగర్‌కర్నూల్ జిల్లాలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సస్పెండ్

నాగర్‌కర్నూల్: జిల్లాలోని కేజీబీవీ ప్రత్యేక అధికారిని అధికారులు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ ఉద్యగులకు, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారు. దీంతో కోడెర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి సీఎం కేసీఆర్ చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు కేజీబీవీ ప్రత్యేక అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచారు. కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు 180 రోజులూ ప్రసూతీ సెలవులు ప్రకటించారు. సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పింఛన్‌ ఇస్తామని తెలిపారు. 

Updated Date - 2021-03-26T13:31:20+05:30 IST