కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-08-11T06:06:07+05:30 IST

మండలకేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యా లయంలో చదువుకుంటూ మృతి చెందిన గిరిజన విద్యార్థిని కవిత మృతిని నిరసిస్తూ బుధవారం గిరిజన సంఘాలు ధర్నా నిర్వహించాయి. స్పందించిన అధికార యంత్రాంగం స్పెషల్‌ ఆఫీసర్‌ రజిత, ఏఎన్‌ఎం అరుణలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి

కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం సస్పెన్షన్‌
గిరిజనులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

గిరిజనుల ధర్నాకు స్పందించిన అధికార యంత్రాంగం

విద్యార్థిని మృతి పట్ల గిరిజన సంఘాల ఽధర్నా 

ఉట్నూర్‌, ఆగస్టు 10: మండలకేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యా లయంలో చదువుకుంటూ మృతి చెందిన గిరిజన విద్యార్థిని కవిత మృతిని నిరసిస్తూ బుధవారం గిరిజన సంఘాలు ధర్నా నిర్వహించాయి. స్పందించిన  అధికార యంత్రాంగం స్పెషల్‌ ఆఫీసర్‌ రజిత, ఏఎన్‌ఎం అరుణలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి ప్రకటించారు. అంతకుముం దు స్థానిక కేజీబీవీకి చెందిన పదవ తరగతి విద్యార్థిని వైద్యం అందుకుంటూ రిమ్స్‌లో మంగళవారం మృతి చెందడంతో గిరిజన సంఘాల నాయకులు కేజీ బీవీ ముందుకు చేరుకోని ఆందోళనకు పూనుకున్నారు. ఆదివాసీ సంఘాలు, మహిళా సంఘాలు, లంబాడా గిరిజన జేఏసీ నాయకులు తరలివచ్చి ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం శేషారావు, బాలేరావు, బాపురావు, వసంత్‌లు మాట్లాడుతూ విద్యార్థిని అనారోగ్యానికి  గురైనప్పటికీ స్థానిక సిబ్బంది సరైన విధంగా స్పందించక పోవడంతో కవిత మృతి చెందిందని ఆరోపించారు. ఆ తర్వాత ఆందోళనకారులను అధికారులు సముదాయించిన్పటికీ.. జిల్లా విద్యాశాఖ అధికారి రావాలని పట్టుపట్టారు. దీంతో అక్కడికి డీఈవో చేరుకోగా.. బాధిత అధికారులను సస్పె న్షన్‌ చేయాలని, బాలిక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డి మాండ్‌ చేయడంతో డీఈవో కలెక్టర్‌కు, పీవోలకు తెలియజేస్తానని వివ రించా రు. దీంతో సస్పెన్షన్‌ చేసే వరకు ధర్నా ఉపసంహరించమనడంతో.. ఐటీడీఏ పీవోతో డీఈవో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో పీవో ధర్నా వద్దకు చేరుకొని గిరి జనులతో మాట్లాడి ఇద్దరిని సస్పెన్షన్‌ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, కేజీబీవీలో పదవ తరగతి విద్యార్థిని కవిత అనారోగ్యంతో మృతి చెం దడంతో ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, తహసీల్దార్‌ భోజన్న, ఎంఈవో గంగుల శ్రీనివాస్‌, సీఐ సైదారావులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థిని మృతికి గల కారణాలను స్పెషల్‌ ఆఫీసర్‌ రజిత, ఏఎన్‌ఎం అరుణలను అడిగి తెలుసు కున్నారు. ఆ తర్వాత ఆదివాసీ సంఘాలకు చెందిన ప్రతినిధులు పుర్క బాపురావు, పెందూర్‌ పుష్పరాణీ, కుడిమెత తిరుపతి, బాలేరావు, శేషారావులు విద్యార్థినులతో మాట్లాడారు. వారితో పాటు మడావి మానిక్‌రావు, సర్పంచ్‌లు నాగమణి, సురేఖ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T06:06:07+05:30 IST