కేజీబీవీ పాఠశాల నిర్వహణ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి

ABN , First Publish Date - 2022-07-06T07:06:43+05:30 IST

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భైంసా కేజీబీవీ పాఠశాల నిర్వాహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌ రావుపటేల్‌ డిమాండ్‌ చేశారు.

కేజీబీవీ పాఠశాల నిర్వహణ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
కేజీబీవీ పాఠశాలను పరిశీలిస్తున్న బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి

భైంసా, జూలై 5 :  విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భైంసా కేజీబీవీ పాఠశాల నిర్వాహణ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌ రావుపటేల్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం భైంసాలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి పురుగులతో కూడిన అన్నం తిని అస్వస్థత చెందిన, నిరసం చేంది పడిపోయిన విద్యార్థులను పరామర్శించారు. నిర్వాహణ వ్యవస్థను పరిశీలిం చారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ ఉమ్మడి జిల్లా ప్రతినిధి భోస్లే మోహన్‌రావుపటేల్‌ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారి యంత్రాంగం తక్షణమే భైంసా కేజీబీవీ పాఠశాల నిర్వాహణ వ్యవ స్థను ప్రక్షాళన చేయాలన్నారు. పురుగుల అన్నం అందించడంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిత కేజీబీవీ పాఠశాలను సంఘం సభ్యులతో కలిసి సందర్శించారు. విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డింపుపై విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అనుబంధ సంస్థలతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. 

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్రసర్కార్‌ 

కార్పోరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాసే రీతిలో రాష్ట్ర సర్కార్‌ వ్యవ హరిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తుందని ఏబీవీపీ ఇందూర్‌ విభాగ్‌ కన్వీనర్‌ గంగాప్రసాద్‌ ఆరోపించారు. మంగళవారం రాష్ట్రశాఖ మేరకు భైంసాలో విద్యాసంస్థల బందు నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమయి నెల రోజులు సమీపిస్తున్న నేటికి ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదన్నారు. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ జరగలేదన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. వసతుల లేమి సౌకర్యాల కరువుతో విద్యార్థులు సతమతమవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ఉపాధ్యాయుల కొరత నేటికి తీరలేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యపు ధోరణి విడనాడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ మెరుగు దలకు తక్షణమే చర్యలు చేపట్టనున్నారు. లేని పక్షంలో యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. 

Updated Date - 2022-07-06T07:06:43+05:30 IST