కేజీబీవీ భవనాలను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-09-17T06:25:52+05:30 IST

సిరిసిల్ల, వేములవాడలో నిర్మిస్తున్న కేజీబీవీ భవనాలను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాల ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

కేజీబీవీ భవనాలను త్వరగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

 - కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, సెప్టెంబరు 16: సిరిసిల్ల, వేములవాడలో నిర్మిస్తున్న కేజీబీవీ భవనాలను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాల ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం సాయంత్రం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందుతున్న సేవలు, భవిత సెం టర్ల నిర్వహణ, కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌లో విద్యార్థు ల ప్రగతితో పాటు మూడు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మోడల్‌ స్కూల్‌లో  చదివే విద్యార్థులను, ఐఐటీ, నీట్‌, పరీక్షలలో విజయం సాధించే దిశగా వారికి శిక్షణ ఇవ్వాలని, జిల్లా విద్యాధికారికి సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధాకిషన్‌, డీఈ నర్సింహారావు, సమగ్ర శిక్షణ కో ఆర్డినేటర్‌లు సూర్యనర్సింహారావు, విద్యాసాగర్‌, పద్మజ, శైలజ, బాలచందర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌ అఫీసర్‌ సాపియా పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-17T06:25:52+05:30 IST