KBR పార్కులో సినీ నటిపై దాడి చేసింది ఇతడే..!

ABN , First Publish Date - 2021-11-20T12:27:05+05:30 IST

సినీనటి చౌరాసియా పై దాడి కేసు కొలిక్కివస్తోంది. ..

KBR పార్కులో సినీ నటిపై దాడి చేసింది ఇతడే..!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : సినీనటి చౌరాసియా పై దాడి కేసు కొలిక్కివస్తోంది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. చౌరాసియా చెప్పిన పోలికలను బట్టి పోలీసులు సినీ పరిశ్రమలో పనిచేసే వారి కదలికలపై దృష్టి సారించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇందిరానగర్‌లో నిఘా పెట్టింది. లైట్‌మన్‌గా పనిచేసే ఓ వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చౌరాసియా వద్ద నుంచి స్నాచింగ్‌ చేసిన సెల్‌ఫోన్‌ కోసం గాలిస్తున్నారు. నిందితుడిని శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-20T12:27:05+05:30 IST