పబ్‌ల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-30T22:01:12+05:30 IST

ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని

పబ్‌ల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని పబ్‌ల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. ఊహించిన దానికంటే పోలీసులు ఎక్కువ చర్యలు తీసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. పబ్‌ల ఎదుట హెచ్చరిక బోర్డ్‌లు పెట్టాలని నిర్వాహకులను ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్‌ నిర్వాహకులదే బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను జనవరి 4వ తేదీ ఉదయం వరకూ అమలుచేయాలని పోలీసులను ఆదేశించింది. శబ్ద కాలుష్యం 45 డేసిబుల్స్‌కి మించరాదని హైకోర్టు సూచించింది. ఎక్సైజ్ శాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లలో జంటలు, మైనర్లకు అనుమతిని నిరాకరించాలని తెలిపింది. కొత్త సంవత్సర వేడుకలపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. వేడుకలు ముగిసిన తరువాత జరిగిన పరిణామాలు, పోలీసుల నివేదిక ఆధారంగా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు  తెలిపింది. తదుపరి విచారణను జనవరి 6కి హైకోర్టు వాయిదా వేసింది. 




Updated Date - 2021-12-30T22:01:12+05:30 IST