Abn logo
Sep 25 2021 @ 02:01AM

ఐపాడ్‌ ఓఎస్‌15 కీ ఫీచర్లు

తమ వినియోగదారుల కోసం ఐపాడ్‌ ఓఎస్‌15 విడుదలైంది. ఇది పలు ఫీచర్ల సమాహారం. నోటిఫికేషన్లను ఆర్గనైజ్‌ చేసుకోవడంతో మొదలుపెట్టి మల్టీ టాస్కింగ్‌ వరకు పలు విషయాలు ఇందులో విడుదల చేసింది. ముఖ్యంగా అయిదింటిని చూద్దాం.


మెరుగైన మల్టీ టాస్కింగ్‌ కీబోర్డ్‌తో షార్ట్‌కట్స్‌

పాడ్‌ ఓఎస్‌15తో మల్టీటాస్కింగ్‌ బాగా మెరుగైంది. యాప్‌ల్లోని టాప్‌లో ఇది కనిపిస్తుంది. స్ల్పిట్‌ వ్యూలోకి సులువుగా వెళ్ళవచ్చు. టాప్‌తో స్లయిడ్‌ ఓవర్‌ కావచ్చు. స్ల్పిట్‌ వ్యూతో సులువుగా హోమ్‌ స్ర్కీన్‌లోకి వెళ్ళవచ్చు. న్యూ సెల్ఫ్‌ ఉపయోగించి, సఫారి, పేజెస్‌ వంటి మల్టిపుల్‌ విండోస్‌లో మల్టీ టాస్కింగ్‌ చేసుకోవచ్చు. కీబోర్డులో షార్ట్‌కట్స్‌ పెట్టింది. స్ల్పిట్‌ వ్యూ, స్లయిడ్‌ ఓవర్‌ మధ్య సెట్టింగ్‌, రెంటిలోకి మారడం వంటి పనులు చేసుకోవచ్చు.

 

విడ్జెట్స్‌తో న్యూ లుక్‌

ఐఓఎస్‌ 14తోనే విడ్జెట్స్‌ పాపులర్‌ అయ్యాయి. ఐఓఎస్‌ 15తో అవి కాస్తా యాప్స్‌ హోమ్‌స్ర్కీన్‌లో టాప్‌లో ప్రత్యక్షమై మరింత పర్సనలైజ్డ్‌ అనుభవాన్ని కలిగిస్తున్నాయి. ఐపాడ్‌లో మరింత పెద్ద డిస్‌ప్లే కోసం విడ్జెట్‌ సైజ్‌ను యాపిల్‌ పెంచింది. యాప్‌ లైబ్రరీ కూడా ఉంది. ఇది యాప్‌లను ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్‌ చేసేందుకు వీలుకల్పిస్తుంది. డెస్క్‌నుంచే యాక్సెస్‌లోకి వస్తుంది. 


ఫేస్‌టైమ్‌ కాల్స్‌ మెరుగు

ఐపాడ్‌ నుంచి ఫేస్‌టైమ్‌ ఆడియో, వీడియో కాల్స్‌ చాలా సహజంగా, లైవ్లీగా ఉంటాయి. ఐపాడ్‌పై ఉన్న ఫేస్‌టైమ్‌లో స్పేషియల్‌ ఆడియో ఫీచర్‌ ఉంటుంది. వాయిస్‌ ఐసోలేషన్‌, కొత్త మైక్రోఫోన్‌ మోడ్‌, నేపథ్య శబ్దాలను అడ్డుకునేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ వినియోగం, తద్వారా యూజర్‌ వాయిస్‌కు ప్రాధాన్యం ఉన్నాయి. గ్రూప్‌ ఫేస్‌టైమ్‌లో పార్టిసిపెంట్స్‌ అందరూ డిస్‌ప్లేకు ఆప్షన్‌ కూడా ఉంది. 


ఆండ్రాయిడ్‌, విండోస్‌తోనూ ఫేస్‌టైమ్‌

ఐపాడ్‌ ఓఎస్‌15తో ఆండ్రాయిడ్‌, విండో డివైస్‌లకూ ఫేస్‌టైమ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.  ఐఫోన్‌, ఐపాడ్‌, మేక్‌తో యూజర్లు లింక్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌లు తదితరాలు షేర్‌ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్‌లన్నీ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయి. 


అన్ని కొత్త నోటిఫికేషన్లు

నోటిఫికేషన్లను రీడిజైన్‌ చేశారు. ఫొటోలు పెద్ద ఐకాన్‌తో కనిపిస్తాయి. దీంతో యాప్‌ ఐకాన్స్‌  గుర్తింపు చాలా సులువుగా ఉంటుంది. ఇకపై నోటిఫికేషన్‌ సమ్మరీని కూడా పొందవచ్చు. ఉదయం,  సాయంత్రం లేదా అనుకూలం సమయంలో నోటిఫికేషన్ల సమ్మరీ పొందొచ్చు. గుట్టగా నోటిఫికేషన్లు అందుబాటులోకి వస్తాయి. దాంతో రోజువారీ కార్యకలాపాలు సైతం సులువుగా అనిపిస్తాయి.