Abn logo
Sep 10 2021 @ 18:25PM

వివేకాను చంపింది.. వారిద్దరే..!

సీబీఐ అధికారుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన.. ఉమా శంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. వారు ఇచ్చిన వివరాల మేరకు.. వివేకా హత్య కేసులో సునిల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్ర పై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హత్య కేసులో వీరిద్దరి కుట్ర కోణం ఉందనే విషయం తమ విచారణలో వెల్లడైందన్నారు. ఉమాశంకర్ రెడ్డి పాత్రపై సునిల్ యాదవ్ విచారణలో తేలినట్లు వివరించారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉందనే విషయం తేలినట్లు ఉంది.


వివేకా హత్యకు ముందే, ఆయన ఇంటి వద్ద ఉన్న కుక్కను సునిల్‌యాదవ్, ఉమాశంకర్ రెడ్డి కలిసి కారుతో ఢీకొట్టి చంపేశారు. అనంతరం వివేకాను హత్య చేయడానికి సునిల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పల్సర్ బైకులో వెళ్లారు. ఉమాశంకర్ రెడ్డి పల్సర్ బైక్‌లో గొడ్డలి పెట్టుకొని పారిపోయారు. బైకు, గొడ్డలిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లో ఫోరెన్సిక్ నివేదిక కూడా తెప్పించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అలాగే గత నెల 11న ఉమాశంకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరికొందరు నిందితులు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.