ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు

ABN , First Publish Date - 2021-12-24T01:20:36+05:30 IST

ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎస్ సమీర్‌శర్మ వారం రోజుల పాటు సమయం ఇవ్వమని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కోరారు.

ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు

విజయవాడ: ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎస్ సమీర్‌శర్మ వారం రోజుల పాటు సమయం ఇవ్వమని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కోరారు. సీఎస్‌పై గౌరవంతో ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించామని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలపై చర్చలు జరుగుతుండగానే 2000 కోట్లకు బకాయిలు చేరడం ఆందోళన కలిగిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. వీలైనంత తొందరగా వాటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యమ కార్యచరణపై నిర్ణయం తీసుకోవడానికి జనవరి 3న కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఇరు జేఏసీల ఐక్య వేదికలు క్షేత్రస్థాయి నుండి.. రాష్ట్రస్థాయి వారకూ సమావేశాలు నిర్వహించి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వానికి జనవరి 3 వరకూ సమయం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆ తరువాత ఏ క్షణంలో అయినా తిరిగి ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమని ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు తెలిపారు.

Updated Date - 2021-12-24T01:20:36+05:30 IST