Jul 25 2021 @ 13:30PM

కీలక ఆధారాలు స్వాధీనం..రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

అశ్లీల చిత్రాలు తీసి వాటిని యాప్‌లలో షేర్ చేయడం వంటి పలు ఆరోపణలతో జూలై 12న రాత్రి రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సోదాలు నిర్వహించిన పోలీసులకి కీలక ఆధారాలు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారట. దీంతో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అశ్లీల వీడియోల కేసులో రాజ్ కుంద్రా కార్యాలయంలో సోదాలు చేసినప్పుడు సీక్రెట్‌గా దాచిన అల్మరాను కనుగొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఇందులోని బాక్సుల నుండి ఫైళ్లు, పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు స్వాధీనం చేసుకున్న బాక్సుల్లో ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన అలాగే క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఫైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

Bollywoodమరిన్ని...