పోలీసుల చేతికి కీలక ఆధారాలు

ABN , First Publish Date - 2020-11-30T05:06:53+05:30 IST

నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్లకు సంబంఽ దించి పోలీస్‌ విచారణ కొనసాగుతోంది. కీలక ఆధారాలు పోలీసుల చేతికి అందినట్టు తెలుస్తోంది.

పోలీసుల చేతికి కీలక ఆధారాలు


రెండో రోజు సాగిన నకిలీ సర్వీసు సర్టిఫికెట్ల విచారణ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 29: నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్లకు సంబంఽ దించి పోలీస్‌ విచారణ కొనసాగుతోంది. కీలక ఆధారాలు పోలీసుల చేతికి అందినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట నకిలీ సర్వీస్‌ సర్టిఫకేట్లతో వైద్య ఆరోగ్య శాఖలో కొలువులు సాధించిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుం చి శాఖపరమైన విచారణ కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా రెండో రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఓ ప్రైవేట్‌ వైద్యాధికారి, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగి,  ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసేసిన మరో మహిళా అభ్యర్థిని విచారించారు. నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్‌ ఎలా సమకూర్చారు? ఎవరి ద్వారా లాబీయింగ్‌ జరిపారు? అన్న సమగ్ర వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఉదంతంలో కీలకంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు సెలవులో ఉన్నారు. దీంతో ఆయన విచారణకు హాజరుకాలేదు. దాదాపు విచారణ పూర్తయినట్లే అని.. మిగిలింది అరెస్ట్‌లేనని విశ్వసనీయ సమాచారం. టెక్కలి డివిజన్‌కు చెందిన ఒక ఉద్యోగి కీలక ఆధారాలు, సమాచారాన్ని పోలీసులకు నేరుగా అందించినట్టు తెలుస్తోంది.  


Updated Date - 2020-11-30T05:06:53+05:30 IST