Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐఐటీహెచ్‌ టీహాన్‌, ఏఆర్‌ఏఐ మధ్య కీలక ఒప్పందం

సాంకేతిక రంగంలో సహకారమే లక్ష్యం

కంది, అక్టోబరు 14: సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్‌ పరిధిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్‌హబ్‌ ఆన్‌ అటానమస్‌ నావిగేషన్‌ (టీహాన్‌), ఆటోమోటీవ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) గురువారం కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో సహకారమే ఈ ఒప్పందం ఉద్ధేశం. కొవిడ్‌ కారణంగా రెండు సంస్థల ప్రతినిధులు వర్చువల్‌ విధానంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఐఐటీహెచ్‌, ఏఆర్‌ఏఐ సంస్థలు పరిశ్రమలను ప్రోత్సహించడానికి, పరిశోధన చేయడానికి, సాంకేతికపరమైన అభ్యాసాలను అందించడానికి సంయుక్తంగా ప్రయత్నిస్తాయి. ఏఆర్‌ఏఐతో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఆటోమొబైల్‌ తయారీదారులకు టెస్ట్‌బెడ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి, సర్టిఫికెట్‌ ప్రోగ్రాంలను ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడించారు. 

Advertisement
Advertisement