మా అబ్బాయి కోసం రోజంతా బండి నడపాలి...

ABN , First Publish Date - 2022-06-15T18:53:41+05:30 IST

మా అబ్బాయి కోసం రోజంతా బండి నడపాలి...

మా అబ్బాయి కోసం రోజంతా బండి నడపాలి...

నా కొడుకు 14 ఏళ్ళ వెంకన్న ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ ఆగకుండా తిరుగుతూనే ఉన్నాం. వాడు పుట్టినప్పటి నుంచీ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. వాడి తోటి పిల్లలంతా బాల్యాన్ని ఆనందిస్తుంటే... మా అబ్బాయి ఇప్పటివరకూ ఒక్క రోజు కూడా అలా జీవించలేదు. వెంకన్న అంత బాధ, వేదన అనుభవిస్తుంటే నా గుండె ముక్కలైపోతోంది. వాడికి వైద్యం చేయించి, జబ్బు నయమయ్యేలా చేసి, వాడికి దక్కాల్సిన జీవితాన్ని అందించడమే నా జీవిత లక్ష్యం. వెంకన్న చక్కగా కోలుకుని తన కలల్ని సాకారం చేసుకుంటాడని నాకైతే కచ్చితంగా నమ్మకముంది.

వెంకన్న పుట్టేనాటికి నా తొలిచూరు బిడ్డ ప్రమీల 10 ఏళ్ళ పిల్ల. తమ్ముడు వెంకన్నని విడిచి ఆ పిల్ల ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. తమ్ముడికి తను ఒక గొప్ప తోబుట్టువని రుజువు చేసుకుంది. వెంకన్నని ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పుడల్లా ప్రమీలని ఓదార్చడం మా వల్ల అయ్యేది కాదు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ పరిస్థితిని ప్రమీల అర్థం చేసుకుంది కానీ, వెంకన్నని ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి ఏవేవో సాకులు చెప్పాల్సి వచ్చేది. వెంకన్నకి డాక్టర్లు చెప్పిన ప్రకారం సర్జరీ చేయించాలంటే అది మాకు తలకు మించిన భారమవుతుంది. ఇంత తక్కువ సమయంలో డాక్టర్లు చెప్పిన మొత్తం సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరో దారి చూపించమని డాక్టర్లని ఎంతో వేడుకున్నాం. వెంకన్నకి చికిత్స మొదలు పెట్టి... బాబుకి మంచి వైద్యం కోసం ఆంధ్ర నుంచి చెన్నైకి.... తర్వాత హైదరాబాదుకి ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది.




ప్రస్తుతం మా అబ్బాయికి 14 ఏళ్ళు. వాడికి చెయ్యాల్సిన హార్ట్ సర్జరీని ఇక వాయిదా వెయ్యలేం. మందులు ఎక్కువ కాలం పని చెయ్యవని... వెంకన్నకు సర్జరీ మాత్రమే అత్యంత ముఖ్యమని చెప్పేశారు. ఈ సర్జరీకి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 5 లక్షలు (6443.47 అమెరికన్ డాలర్లు). రిక్షా డ్రైవర్ అయిన నా భర్త మమ్మల్ని పోషించడానికి రోజంతా బండి నడపాల్సిందే... మేం వేరే ఉరికి వెళ్ళినప్పుడల్లా ఆయనకి వచ్చే ఆదాయం దెబ్బతింటుంది. మా ఇద్దరి పిల్లల కోసం తిండి కూడా మానేయడం అలవాటైపోయింది. వైద్య ఖర్చుల కోసం గత కొన్నేళ్ళుగా మేం ఎలాగోలా రూ.3 లక్షలు ఖర్చుపెట్టాం. మేం దాచుకున్నదంతా ఖర్చయిపోయింది. ఇంకేమీ మిగల్లేదు. ఇప్పుడు ఈ సర్జరీ ఎలా చేయించాలో మాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు మాకున్న దిక్కల్లా మీరు మాత్రమే. నా భర్త పగలూరాత్రీ పని చేస్తుంటే.... నేను ఆస్పత్రిలో మా అబ్బాయతోనే ఉంటున్నాను. నా కొడుకు జీవితంతో పోరాడుతుంటే మేం మూడు పూటలా అన్నం కోసం యుద్ధం చేస్తున్నాం. దయచేసి ఈ సర్జరీకి అయ్యే రూ.5 లక్షలు (6443.47 అమెరికన్ డాలర్లు) సేకరించడంలో మాకు సాయపడండి. నా కొడుక్కి కొత్త జీవితం సమకూరడానికి మీరు మాత్రమే సాయపడగలరు.


Updated Date - 2022-06-15T18:53:41+05:30 IST