Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 03 Dec 2021 20:19:01 IST

నాలాంటి వాళ్లను భరించడం కష్టం: హీరోయిన్ కేతిక శర్మ

twitter-iconwatsapp-iconfb-icon

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర హీరోయిన్‌గా కేతిక శర్మ మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను నటించిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు.. సంతోష్ గారు కలిసి ‘లక్ష్య’ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన పాత్రకు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో చేయడం జరిగింది. ఇందులో నా పాత్ర పేరు రితిక. ఆమె తన మనసుకు ఏదనిపిస్తే అదే చేస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. లక్ష్య చిత్రం పార్దు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది.


నాగశౌర్య నుండి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హార్డ్ వర్కింగ్, డెడికేషన్ ఉన్న నటుడు. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్. నాకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే చేస్తాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆర్చరీ మీద ఇంత వరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమాను చేయాలనిపించింది. ఈ సినిమా సమయంలో ఎంతో మంది ఆర్చర్స్‌ను కలిశాను. నేను కూడా ఆర్చరీ గురించి కొంచెం నేర్చుకున్నాను. నాగశౌర్య గారు అద్భుతంగా నటించారు. ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తాయి. నా పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది. నా ఫస్ట్ మూవీ ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ గారి సినిమా. ఆయన నుండి కాల్ వస్తే ఎలా కాదనగలం. అలా పూరి జగన్నాథ్ గారు పిలవడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. రొమాంటిక్ సినిమాలో గ్లామరస్ రోల్. ఇందులో మాత్రం ఎమోషనల్ పాత్రలో కనిపిస్తాను.

‘లక్ష్య’ సినిమాలోని రితికలా నిజ జీవితంలోనూ నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తాను.. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. మనసుకు ఏదనిపిస్తే అది చేసే వాళ్లతో వేగడం చాలా కష్టం. రొమాంటిక్ సినిమాలో పాట పాడాను. మా సినిమాలో ఎందుకు పాడలేదు అని లక్ష్య టీం వాళ్లు కూడా అడిగారు. త్వరలోనే డబ్బింగ్ కూడా ట్రై చేస్తాను. ఈ సినిమాలో నా వాయిస్‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. దర్శకుడు సంతోష్ గారికి చాలా క్లారిటీ ఉంది. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉంటారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉంటారు. అలా డైరెక్టర్ ఉంటే అందరిలోనూ ఎనర్జీ వస్తుంది. 


నాకు జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని అనుకున్నాను.. అయ్యాను. కానీ అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా పేరెంట్స్ డాక్టర్స్. మాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. వారు నాకు ఓ ఏడాది టైం ఇచ్చారు. వారిచ్చిన టైమ్ కంటే ముందే నటిని అయ్యాను. ప్రతీ భాషలో నటించాలని ఉంది. తమిళంలో అయితే ఎక్కువ నటనను కోరుకుంటారు. నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే మొదటి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు. ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..’’ అని తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement