Oct 27 2021 @ 17:28PM

పూరి సారే అంతా.. నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం: కేతికా శర్మ

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 29న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరోయిన్ కేతిక శర్మ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆమె మాట్లాడుతూ.. ‘‘నా మొదటి చిత్రమే పూరి క‌నెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా ఆయన మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను ఢిల్లీ నుండి వ‌చ్చాను. మాది డాక్ట‌ర్స్ ఫ్యామిలీ. అయితే నాకు మాత్రం సినిమా రంగమంటే చాలా ఇష్టం. అందుకే సినిమా ఫీల్డ్‌కి రావాలని అనుకున్నాను. ఇలా డెబ్యూ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్‌స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా ‘రొమాంటిక్’ జర్నీ మొదలైంది. 

కేతికా శర్మ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి పాత్రలో ఈ సినిమాలో నటించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే.. నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను చాలా ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషం నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది. సినిమా అందరికీ నచ్చుతుంది. సూపర్ హిట్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఫుల్ మాస్ థియేటర్ మూవీ. పక్కా పూరిగారి సినిమాలా ఉంటుంది.


ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుంది. రమ్యకృష్ణ గారు, ఆకాష్‌తో కలిసి నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు అనిల్‌గారిని ప్ర‌తీ సీన్ గురించి పదే పదే అడిగేదాన్ని.. అలాగే ప్ర‌తి సీన్ ఎంత ఇంటెన్సిటీతో చేయాలో చూసుకునేదాన్ని. టోట‌ల్ ఔట్‌పుట్ చూశాక ఆడియెన్స్‌కు నేను నచ్చుతాను అని అనిపించింది. ఆకాష్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. రమ్యకృష్ణగారి న‌ట‌న‌ అద్భుతం. ఆమె ఈ చిత్రంలోకి రావడంతో అంతా మారిపోయింది. మకరంద్ గారు ఇలా ప్రతీ ఒక్కరితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఛార్మీగారు మా వెంటే ఉన్నారు. ఆమే నాకు శిక్షణ ఇచ్చారు. మౌనికను నాలో ఆమె చూశారు. నన్ను నమ్మారు. ఆమె ఎంతో మంచి వ్యక్తి.

Read Also: మా నాన్నని వదిలి దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది: హీరో ఆకాష్ పూరి

పూరిగారు ఓ అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారంటే.. కచ్చితంగా ఏదో టాలెంట్ ఉందని అంతా అనుకుంటారు. అందుకే నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. అదంతా పూరిగారి వల్లే. నాగశౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను. బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరి సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే.


ప్రభాస్‌గారు మా టీమ్‌ను పిలిచారు.. డార్లింగ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు. కానీ బాహుబలి మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది.


రొమాంటిక్ చిత్రాన్ని కరోనా టైమ్ కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమా కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే డబ్బింగ్ చెప్పాలని, అది జరగాలని ఆశిస్తున్నాను. ‘రొమాంటిక్’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరంతా కూడా రొమాంటిక్ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతారు. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. ప్రతీ సీన్ ట్రీట్‌లా ఉంటుంది..’’ అని అన్నారు.