Abn logo
Jul 26 2021 @ 22:11PM

‘కేతకీ’లో సివిల్‌ సప్లైస్‌ చైర్మన్‌ పూజలు

పూజలు చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి, శివకుమార్‌

ఝరాసంగం, జూలై 26 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ చెర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీసీఎంఎస్‌ చెర్మన్‌ మాల్కాపూరం శివకుమార్‌ పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వారిని ఆలయ ఈవో మోహాన్‌రెడ్డి సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. సర్పంచ్‌ జగదీశ్వర్‌, ఆలయ మాజీ చైర్మన్‌ నర్సింహాగౌడ్‌, ధర్మకర్త నాగన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.