కెర్బర్‌ జోరు యూఎస్‌ ఓపెన్‌

ABN , First Publish Date - 2020-09-03T09:52:55+05:30 IST

యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌, 8వ సీడ్‌ పెట్రా మాట్రిక్‌ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.

కెర్బర్‌ జోరు యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌, 8వ సీడ్‌ పెట్రా మాట్రిక్‌ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో జర్మనీ భామ కెర్బర్‌ 6-3, 7-6(6)తో అన్నా లెనా ఫ్రైడ్‌సామ్‌పై గెలిచి ముందంజ వేసింది. పెట్రా మాట్రిక్‌ 6-3, 6-4తో కట్రినా బోండరెంకో (ఉక్రెయిన్‌)పై, 14వ సీడ్‌ కొంటావిట్‌ (ఇస్టోనియా) 6-4, 6-1తో జువాన్‌పై, అలెక్సాండ్రా సాంచోవిచ్‌ 6-1, 6-2తో వాండొర్సొవాపై నెగ్గారు. కాగా, అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ రికార్డు విజయంతో రెండో రౌండ్‌కు చేరుకొంది. తొలి రౌండ్‌లో సెరెనా 7-5, 6-3తో క్రిస్టీ అన్‌ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ క్రమంలో యూఎస్‌ ఓపెన్‌లో అత్యధికంగా 102 మ్యాచ్‌లు నెగ్గిన సెరెనా.. క్రిస్‌ ఎవర్ట్‌ రికార్డును అధిగమించింది.


2012లో టెన్ని్‌సకు మరోసారి వీడ్కోలు పలికిన తర్వాత మళ్లీ బరిలోకి దిగిన మాజీ చాంపియన్‌ కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం) 6-3, 5-7, 1-6తో ఎకతరీనా అలెగ్జాండ్రా చేతిలో ఓడింది. రెండోసీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-2, 6-2తో యానిన్‌ విక్‌మేయర్‌పై, అరెనా సబ్లెంకా 7-6(1), 6-4తో ఒషీన్‌ డోడిన్‌పై, ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6-1, 6-1తో టిమియా బబో స్‌పై, విక్టోరియా అజరెంకా (బెలారస్‌) 6-1, 6-2తో బార్బరా హాస్‌ (ఆస్ట్రియా)పై, స్లోన్‌ స్టీఫెన్స్‌ 6-3, 6-3తో మిహేల బజర్‌నెస్కూపై గెలిచారు. వీనస్‌ విలియమ్స్‌ 3-6, 5-7తో కరోలినా ముచోవా చేతిలో పరాజయం పాలైంది.

మర్రే పోరాటం..

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యూకే ఆటగాడు ఆండీ మర్రే 4-6, 4-6, 7-6(5), 7-6(4), 6-4తో యొషిహిటో నిషియోకపై పోరాడి నెగ్గాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయినా.. అనూహ్యంగా పుంజుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సీడ్‌ మెద్వెదేవ్‌ 6-1, 6-2, 6-4తో డెల్బోని్‌సను, మాటియో బెరెట్టిని 7-6(5), 6-1, 6-4తో సొయేడాను ఓడించారు. డొమినిక్‌ థీమ్‌ 7-6(6), 6-3తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి జుమి మునార్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. రిచర్డ్‌ గాస్కెట్‌ 7-6(0), 7-6(4), 6-1తో ఇవో కార్లోవిచ్‌పై, దిమిత్రోవ్‌ 6-4, 6-3, 6-1తో టామీ పాల్‌పై, 8వ సీడ్‌ రాబర్టో బటిస్టా అగట్‌ 6-4, 6-4, 7-6(3)తో టెన్నీ శాండ్‌గ్రెన్‌పై నెగ్గారు.

Updated Date - 2020-09-03T09:52:55+05:30 IST