కేరళలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-07T03:25:44+05:30 IST

కేరళలో కరోనా కేసులు మళ్లీ దారుణంగా పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 108 కేసులు వెలుగు చూడగా

కేరళలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు మళ్లీ దారుణంగా పెరుగుతున్నాయి. నేడు కొత్తగా 108 కేసులు వెలుగు చూడగా మలప్పురం జిల్లాకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. వరుసగా రెండో రోజు రాష్ట్రంలో వందకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేకాదు, ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. శుక్రవారం 111 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,029 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు శైలజ తెలిపారు. అలాగే, 1,83,097 మంది నిఘాలో ఉన్నారని, వీరిలో 1,615 మంది ఆసుపత్రులలో ఉండగా, మిగతా వారు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు వివరించారు. శనివారం 284 మంది ఆసుపత్రుల పాలవగా, 50 మంది కోలుకున్నారని, వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 762 మందికి చేరినట్టు తెలిపారు. తాజాగా కోలుకున్న వారిలో ఆరుగురు ఎయిర్ ఇండియా సిబ్బంది కూడా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T03:25:44+05:30 IST