పోలీసులతో ఘర్షణ.. కంటి చూపు పోగొట్టుకున్న Youth Congress leader

ABN , First Publish Date - 2022-06-21T17:23:00+05:30 IST

వారం క్రితం కేరళలోని తొడుపుజ జిల్లాలో పోలీసులతో జరిగిన ఘర్షణలో బిలాల్ సమద్ అనే యూత్ కాంగ్రెస్ నేత తన కంటి చూపు పోగొట్టుకున్నాడని అతడికి వైద్యం చేసిన డాక్టర్లు తెలిపారు. ఇదే ఘర్షణలో మరొకి యూత్ కాంగ్రెస్ నేత తీవ్రంగా గాయపడ్డారు..

పోలీసులతో ఘర్షణ.. కంటి చూపు పోగొట్టుకున్న Youth Congress leader

తిరువనంతపురం: వారం క్రితం కేరళలోని తొడుపుజ జిల్లాలో పోలీసులతో జరిగిన ఘర్షణలో బిలాల్ సమద్ అనే యూత్ కాంగ్రెస్ నేత తన కంటి చూపు పోగొట్టుకున్నాడని అతడికి వైద్యం చేసిన డాక్టర్లు తెలిపారు. ఇదే ఘర్షణలో మరొకి యూత్ కాంగ్రెస్ నేత తీవ్రంగా గాయపడ్డారు. ఇడుక్కి జిల్లా యూత్ కాంగ్రెస్ సీపీ మాథ్యూపై దాడికి వ్యతిరేకంగా జరిగిన చేపట్టిన నిరసన ఘర్షణకు దారి తీసింది. పోలీసులకు యూత్ కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇందులో గాయపడ్డ బిలాల్‌ను ఎర్నాకులంలోని అంగమల్లి ఆసుపత్రికి తరలించారు. కన్నుకు బాగా దెబ్బతగడంతో 20 కుట్లు పడ్డాయని, అయితే అతడి ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయిందని డాక్టర్లు పేర్కొన్నారు.


బిలాల్ వైద్య ఖర్చుల్ని పూర్తిగా పార్టీ భరిస్తుందని కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఎయిర్‌పోర్ట్‌లో డ్రామా ముగియగానే ముందు మంది పోలీసు అధికారులు కాంగ్రెస్ నేతలపై దాడికి దిగారు. మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూడా వారు పట్టించుకోలేదు. సీపీఎం గూండాలు, పోలీసులు కలిసి మా కార్యకర్తల్ని తీవ్రంగా గాయపరిచారు. రాష్ట్రంలో ఇంతటి అణచివేత ఎప్పుడూ చూడలేదు. పోలీసులు అధికారి పార్టీ ఏంజెట్లుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు హత్యా బెదిరింపులు చేసిన సీపీఎం కార్యకర్తలపై కేసు నమోదు చేయడానికి కూడా వారికి మూడు రోజులు పట్టింది’’ అని అన్నారు.

Updated Date - 2022-06-21T17:23:00+05:30 IST