Kerala: చిన్న దుకాణాల్లో విక్రయించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించం...కేరళ మంత్రి వెల్లడి

ABN , First Publish Date - 2022-07-20T18:09:02+05:30 IST

కేరళ(Kerala) రాష్ట్రంలో చిన్న దుకాణాల(small stores) ద్వారా విక్రయించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ(Goods and Services Tax) విధించబోమని...

Kerala: చిన్న దుకాణాల్లో విక్రయించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించం...కేరళ మంత్రి వెల్లడి

తిరువనంతపురం: కేరళ(Kerala) రాష్ట్రంలో చిన్న దుకాణాల(small stores) ద్వారా విక్రయించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ(Goods and Services Tax)  విధించబోమని రాష్ట్ర ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ చెప్పారు.కుటుంబశ్రీ వంటి సంస్థలు లేదా చిన్న దుకాణాలలో 1 లేదా 2 కిలోల ప్యాకెట్లలో లేదా వదులుగా ఉండే పరిమాణంలో విక్రయించే నిత్యావసర వస్తువులపై పన్ను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం లేదని కేరళ ఆర్థిక మంత్రి తెలిపారు.నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం కోరారు.నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, కుటుంబశ్రీ వంటి సంస్థలు లేదా 1 లేదా 2 కిలోల ప్యాకెట్లలో చిన్న దుకాణాలు విక్రయించే వస్తువులపై పన్ను విధించే ఉద్ధేశం లేదని కేరళ ప్రభుత్వం తెలిపింది.


తాము ఈ విషయంలో రాజీకి సిద్ధంగా లేమని, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి చెప్పారు.బ్రాండెడ్ కంపెనీలు ప్యాక్ చేసిన ఉత్పత్తులపై 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని, అయితే తాము బ్రాండ్‌ను క్లెయిమ్ చేయడం లేదని బాలగోపాల్ చెప్పారు.నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-20T18:09:02+05:30 IST