జాబ్ ఆఫర్‌‌తో Germany కి వెళ్తున్న భారతీయ మహిళ.. మధ్యలోనే వెనక్కు పంపించేసిన Qatar.. అసలు కారణమేంటంటే

ABN , First Publish Date - 2022-05-15T03:05:19+05:30 IST

కరోనా టీకాలకు సంబంధించి వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రయాణికులకు ఇప్పటికీ చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా జర్మనీకి పైచదువుల కోసం బయలుదేరిన ఓ భారతీయ యువతి.. మార్గమధ్యంలోనే వెనుదిరగాల్సి వచ్చింది.

జాబ్ ఆఫర్‌‌తో Germany కి వెళ్తున్న భారతీయ మహిళ.. మధ్యలోనే వెనక్కు పంపించేసిన Qatar.. అసలు కారణమేంటంటే

ఎన్నారై డెస్క్: కరోనా టీకాలకు సంబంధించి వివిధ దేశాలు అనుసరిస్తున్న వివిధ విధానాలు ప్రయాణికులకు ఇప్పటికీ చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా జర్మనీకి పైచదువుల కోసం బయలుదేరిన ఓ భారతీయ యువతి.. మార్గమధ్యంలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఆమె వేసుకున్న టీకాకు గుర్తింపు లేదంటూ కటార్ ఎయిర్ ‌పోర్టు అధికారులు ఆమెను మరో విమానంలో స్వదేశానికి పంపించారు. తన ప్రయాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఆ యువతి ఇలా చిక్కుల్లో పడాల్సి వచ్చింది. త్వరగా జర్మనీ యూనివర్శిటీలో చేరని పక్షంలో ఆమె తన స్కాలర్‌షిప్ కోల్పోవచ్చు కూడా..!  ఈ ఘటన తాలూకు పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కేరళరాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన మాళవికా మీనన్‌కు జర్మనీలోని ఫ్రీ యూనివర్శిటీలో రీసెర్చ్ చేసేందుకు అవకాశం లభించింది. అక్కడ ఆమెకు అధ్యాపక ఉద్యోగం కూడా దొరికింది. అయితే.. మాళవిక అప్పటికే కొవ్యాక్సిన్ కరోనా టీకా తీసుకుంది. దీనికి కొన్ని ఐరోపా దేశాల గుర్తింపు లేదు. అయితే.. దేశంలోకి అనుమతిస్తూ ఎంబసీ జారీ చేసిన లేఖ కూడా ఆమె వద్ద ఉంది. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆమె మే 10న ఖతార్ ఎయిర్‌వేస్‌లో జర్మనీకి బయలుదేరింది. కానీ..దోహా చేరుకున్నాక ఆమెకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. కొవాక్సిన్ తీసుకున్న వారికి జర్మనీలోకి అనుమతి లేదంటూ దోహాలో అధికారులు ఆమెను మరో విమానంలో వెనక్కు పంపించేశారు. దీంతో.. మరుసటి రోజు ఆమె భారత్‌కు వచ్చేసింది. ఆశ్చర్యకర విషయమేంటంటే..ఆమె లగేజీ మాత్రం జర్మనీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫ్రీ యూనివర్శిటీ అధికారులు జర్మన్ ఎంబసీకి మరో లేఖ రాశారు. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థకు చేరాక.. తనకు జర్మనీ వెళ్లేందుకు మరో అవకాశం లభిస్తుందని మాళవిక భావిస్తోంది. 

Read more