Leopard: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి.. ఎదురుగా ఉన్న జంతువును చూసి షాక్.. ఇద్దరి మధ్య భీకర పోరాటం.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-04T21:55:16+05:30 IST

జంతుప్రదర్శన శాలలోనైనా చిరుత పులిని చూడాలంటే వణుకు పుడుతుంది.

Leopard: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి.. ఎదురుగా ఉన్న జంతువును చూసి షాక్.. ఇద్దరి మధ్య భీకర పోరాటం.. చివరకు..

జంతుప్రదర్శన శాలలోనైనా చిరుత పులిని చూడాలంటే వణుకు పుడుతుంది. అది బంధించి ఉందని తెలిసినా కొద్దిగా భయం వేస్తుంది. అలాంటిది రోడ్డు మీద నడిచి వెళ్తుండగా ఎదురుపడితే.. హఠాత్తుగా మీద పడి దాడి చేస్తే..  ఎలా ఉంటుంది? కేరళలోని ఓ వ్యక్తికి తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతడిపై చిరుత (leopard) హఠాత్తుగా దాడి చేసింది. ముందు హడలిపోయిన ఆ వ్యక్తి తర్వాత ప్రాణం కోసం చిరుతతో పోరాడాడు. 


ఇది కూడా చదవండి..

Malaysia: మాజీ ప్రియుడు గిఫ్ట్‌గా ఇచ్చిన కారులో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్న యువతి.. ఆ తర్వాత ఏమైందంటే..


కేరళ (Kerala)లోని ఇడుక్కి జిల్లాకు చెందిన గోపాలన్ అనే వ్యక్తి గ్రామంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై అతడికి చిరుత కనిపించింది. గోపాలన్‌ను చూసిన చిరుత వెంటనే అతనిపై దాడికి దిగింది. ముందు షాకై భయంతో వణికిపోయిన గోపాలన్.. ప్రాణం కోసం ఆ చిరుతతో పోరాడాడు. తన దగ్గర ఉన్న కొడవలితో చిరుతను ఎదుర్కొన్నాడు. చిరుత, గోపాలన్ మధ్య కొద్ది క్షణాల పాటు ఫైటింగ్ జరిగింది. చివరకు చిరుత మెడ లోపలికి గోపాలన్ తన కొడవలిని దించాడు. 


తీవ్ర రక్తస్రావం కావడంతో చిరుత అక్కడికక్కడే (Kerala man kills leopard) చనిపోయింది. గోపాలన్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మ రక్షణ కోసం చిరుతను చంపడం వల్ల అతడిపై ఎలాంటి కేసూ ఉండదని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శశీంద్రన్‌ ప్రకటించారు. కాగా, గోపాలన్ పై దాడి చేసిన చిరుత కొన్ని రోజులగా స్థానికులను భయభ్రాంతులకు చేస్తోంది. 

Updated Date - 2022-09-04T21:55:16+05:30 IST