కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని తిప్పి కొట్టిన పోలీస్.. నెట్టింట్లో ప్రశంసలు

ABN , First Publish Date - 2022-06-20T18:10:48+05:30 IST

అలపుజ జిల్లాలోని నూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అరుణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పారా జంక్షన్ ప్రాంతంలో రోడ్డు పక్కన స్కూటీ పార్క్ చేసిన వ్యక్తి దగ్గర తన వాహనాన్ని ఆపి ప్రశ్నించాడు..

కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని తిప్పి కొట్టిన పోలీస్.. నెట్టింట్లో ప్రశంసలు

తిరువనంతపురం: కత్తితో దాడిచేయబోయిన ఒక వ్యక్తిని ఒక పోలీసు అధికారి ఏమాత్రం బెదరకుండా ఎదురు నిలిచి ఆ వ్యక్తిని కిందపడేసి కత్తిని స్వాధీనం చేసుకున్నాడు.  కేరళలోని అలపుజలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, సదరు పోలీస్ ధైర్యసాహసాలను ప్రశ్నంసిస్తూ నెటిజెన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. అవతలి వ్యక్తి ప్రమాదకర రీతిలో కత్తి విసురుతున్నా వెనక్కి తగ్గకుండా పోరాడారంటూ పొగుడుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. అలపుజ జిల్లాలోని నూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై అరుణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పారా జంక్షన్ ప్రాంతంలో రోడ్డు పక్కన స్కూటీ పార్క్ చేసిన వ్యక్తి దగ్గర తన వాహనాన్ని ఆపి ప్రశ్నించాడు. ఇంతలో ఇద్దరికి మధ్య మాటా మాటా పెరిగింది. ఇంతలో స్కూటీ వ్యక్తి ముందుకు కదలబోతుండగా అరుణ్ కుమార్ తన వాహనాన్ని ముందుకు పోనిచ్చి కిందకు దిగబోతుండగా.. స్కూటీ వ్యక్తి ఒక్కసారిగా వేట కత్తి తీసి దాడి చేయబోయాడు. అరుణ్ కుమార్ ఎంత మాత్రం బెదరకుండా ఆ వ్యక్తిని నిలువరించి కింద పడేసి కత్తిని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ ఘర్షణలో ఐస్సై అరుణ్ కుమార్‌కి స్వల్ప గాయమై ఏడు కుట్లు పడ్డాయట. ఈ దాడకి యత్నించిన వ్యక్తి సుగతన్ అని పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటనను స్థానిక ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది కాస్త వైరల్ అయింది. దీనిపై నెటిజెన్లు, పోలీసుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి.











Updated Date - 2022-06-20T18:10:48+05:30 IST