కేరళలో తొలి ఒమైక్రాన్ కేసు.. దేశంలో మొత్తం 38

ABN , First Publish Date - 2021-12-13T02:15:52+05:30 IST

దేశంలో ఈ రోజు ఐదు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల..

కేరళలో తొలి ఒమైక్రాన్ కేసు.. దేశంలో మొత్తం 38

తిరువనంతపురం: దేశంలో ఈ రోజు ఐదు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి పెరిగింది. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కో కేసు నమోదయ్యాయి. తాజాగా కేరళలో తొలి కేసు వెలుగుచూసింది. బాధితుడు ఈ నెల 6న బ్రిటన్ నుంచి వచ్చినట్టు గర్తించారు. కొచ్చి చేరుకున్న తర్వాత అతడికి నిర్వహించిన పరీక్షల్లో తొలుత పాజిటివ్‌గా తేలింది. 


దీంతో అప్రమత్తమైన అధికారులు అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా తాజాగా ఒమైక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాధితుడు కేరళ నివాసేనని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. 

Updated Date - 2021-12-13T02:15:52+05:30 IST