మాస్కులు పెట్టుకోకుంటే రూ.10 వేల జరిమానా

ABN , First Publish Date - 2020-07-06T00:17:54+05:30 IST

మాస్కులు పెట్టుకోకుంటే రూ.10 వేల జరిమానా

మాస్కులు పెట్టుకోకుంటే రూ.10 వేల జరిమానా

తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణకు ప్రజలందరూ మాస్కులు ధరించాలని కేరళ ప్రభుత్వం సూచించింది. మాస్కులు ధరించని వారిపై రూ.10 వేల జరిమానా విధిస్తామని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. మాస్కులు ధరించనందుకు జరిమానాను రూ.10 వేలకు పెంచినట్లు సర్కారు ప్రకటించింది. కోవిడ్ -19తో పోరాడటానికి అంటువ్యాధి నిర్వహణ నియమాలను సవరించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది.


Updated Date - 2020-07-06T00:17:54+05:30 IST