కేరళ ఏనుగు మృతి కేసులో ముగ్గురు అనుమానితులు అదుపులోకి...

ABN , First Publish Date - 2020-06-05T11:31:19+05:30 IST

ఫైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును అత్యంత దారుణంగా చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి ....

కేరళ ఏనుగు మృతి కేసులో ముగ్గురు అనుమానితులు అదుపులోకి...

పాలక్కాడ్(కేరళ): ఫైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును అత్యంత దారుణంగా చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఏనుగును అత్యంత క్రూరంగా చంపిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ సర్కారు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను పోలీసు, అటవీశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పాలక్కాడ్ పోలీసులు, జిల్లా అటవీశాఖ అధికారులు సంఘటన స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు. ఏనుగు నది నీటిలో మునిగి ఊపరితిత్తులు ఫెయిల్ అయి మరణించిందని పశువైద్యులు కళేబరానికి జరిపిన పోస్టుమార్టంలో తేల్చారు. నోటిలో పేలుడు వల్ల ఏర్పడిన గాయంతో ఏనుగు ఆహారం తీసుకోలేక పోయిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. ఆహారం తీసుకోలేక ఏనుగు నీటిలో మునిగి మరణించిందని అధికారులు పేర్కొన్నారు. ఏనుగు మృతి ఘటనపై కేంద్రమంత్రి జవడేకర్, ఎంపీ మనేకాగాంధీ, రతన్ టాటాతోపాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ సర్కారు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

Updated Date - 2020-06-05T11:31:19+05:30 IST